Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: మైనార్టీల సంక్షేమానికి 24 వేల కోట్లు ఖర్చు పెట్టిన జగన్

Nandikotkuru: మైనార్టీల సంక్షేమానికి 24 వేల కోట్లు ఖర్చు పెట్టిన జగన్

డాక్టర్ సుధీర్ ధార, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

వైసీపీ పాలనలో ముస్లిం మైనార్టీ ప్రజలకు 24 వేల కోట్లు రూపాయలను వెచ్చించి వారి సంక్షమానికి కృషి చేసిన ప్రజా పరిపాలన నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుదీర్ దార పేర్కొన్నారు. పట్టణంలోని ప్యారడైస్ ఫంక్షన్ హాల్ నందు మైనార్టీ సెల్ ఉమ్మడి జిల్లాలో జోనల్ ఇంచార్జ్ అబుబుక్కర్, పట్టణ అధ్యక్షులు మన్సూర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ బేగ్, మాజీ కోఆప్షన్ నెంబర్ అబ్దుల్ జాబార్ ఆధ్వర్యంలో “హర్ దిల్ మే వైయస్సార్” – “హమ్ సబ్ జగన్ కే సాత్ ” కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

- Advertisement -

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుదీర్ దార, మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డిలు హాజరయ్యారు. సమావేశంలో ముస్లిం మైనార్టీ జోనల్ ఇంచార్జ్ అబుబుకర్ వైయస్సార్సీపి ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీ ప్రజల కొరకు వారి సంక్షేమ అభివృద్ధి కొరకు కృషి చేసిన విధానాన్ని, అమలైన సంక్షేమ పథకాల వివరాలపై, ముస్లిం ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం చైర్మన్ సుధాకర్ రెడ్డి జగనన్న ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమానికి ఏకంగా 24 వేల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి వారి సంక్షేమ అభివృద్ధి కోసం కృషి చేసిన జననేత జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ ప్రజల పెళ్లిళ్లకు వైయస్సార్ షాది తోఫా లక్ష రూపాయలు ఇచ్చామన్నారు. మస్జిద్ మరమ్మతులు, నూతన మసీదుల నిర్మాణాలకు ప్రత్యేక నిధులు, ఇమాములు, మౌజములకు 15000 గౌరవ వేతనం కేటాయించడం జగనన్న ప్రభుత్వంలోని సాధ్యమైందని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుదీర్ దారా అన్నారు.

కులమత రాజకీయాలకతీతంగా ప్రజలకు సంక్షేమం కోసం పాటుపడిన అన్ని వర్గాల కోసం పాటుపడిన పరిపాలన వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి పాలన అని స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో జగనన్న నాయకత్వాన్ని మరోసారి ఆశీర్వదించి నియోజవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం పట్టణంలోనే ముస్లిం మైనారిటీ తమ ప్రజలకు స్మశాన వాటిక, ఉర్దూ స్కూల్ ఏర్పాటు కోసం కృషి చేయాలని డాక్టర్ సుధీర్ దార కు చైర్మన్ సుధాకర్ రెడ్డి విన్నవించారు.

కార్యక్రమంలో ఖాజీ అబ్దుల్ రహిమాన్, ఖాజీ జలాల్ మౌలానా, కాజీ ఇబ్రహీం మౌలానా, మౌలానా ఆసిఫ్, ఆయూబ్ మౌలానా , మరియు వైఎస్ఆర్సిపి నాయకులు లాయర్ నజీర్ అహ్మద్, మహబూబ్ బాషా, కొత్తపల్లి మండలం గౌస్, జూపాడుబంగ్లా మండలం ఖాజావుద్దీన్, మిడుతూరు మండలం ఖాజీ, కౌన్సిలర్స్ అబ్దుల్ హమీద్, అబ్దుల్ రావు ఫ్, షేక్ నాయబ్, శాలి భాష, ముస్లిం మైనార్టీ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News