Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్YCP-TDP: వైసీపీ నుంచి టిడిపిలోకి 30 కుటుంబాలు

YCP-TDP: వైసీపీ నుంచి టిడిపిలోకి 30 కుటుంబాలు

ఐదేళ్ల పాలనలో దోచుకోవడం దాచుకోవడం తప్ప తాలూకాకు ఎమ్మెల్యే చేసిందేమీ లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. చాగలమర్రి మండలం మల్లె వేముల గ్రామానికి చెందిన వైసిపి నాయకులు ఈదుల శంకర్ రెడ్డి, నంది వాహన రెడ్డి, విగ్నేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, సాంబశివరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, శేఖర్ రెడ్డి లతోపాటు మరో 30 కుటుంబాలు టిడిపిలో చేరాయి. వీరికి అఖిలప్రియ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదేళ్ల అరాచక పాలనలో విసిగిపోయిన ప్రతి ఒక్కరి మనసులో నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవాలన్న తపన బలంగా ఉందని అన్నారు.

- Advertisement -

గుండాయిజం రౌడీయిజం చేసేందుకు సమయం ఉంది కానీ తాలూకాలో సమస్యలపై ఎమ్మెల్యే స్పందించడం లేదని విమర్శించారు. తాలూకాలో 180 కోట్లతో అమృత్ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికి మంచినీటి కొళాయి ఇవ్వాలన్న లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేశారన్నారు. కానీ ఈ పథకాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు తమ కమిషన్ల కోసం నిలిపివేశారని ఆరోపించారు. తాలుకాలో ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతుంటే ప్రజా ప్రతినిధులు. పండగలు చేసుకుంటున్నారని విమర్శించారు. ట్రాక్టర్లు ట్యాంకర్ల ద్వారా నీటిని తోలి నిధులు దుర్వినియోగం చేయుచున్న ఆలోచనతో వారు ఉన్నారన్నారు. ప్రజలు అన్ని గమనస్తున్నారని అందుకే వైఎస్ఆర్సిపి ని వీడి టిడిపిలోకి వలసలు వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి తాలూకా నాయకులు భార్గవ్ రామ్, మండల కన్వీనర్ నరసింహారెడ్డి, సిగ్నా రెడ్డి, జిల్లా స్పోక్ పర్సన్ సల్లా నాగరాజు, టిడిపి నాయకులు ముల్లా అబ్దుల్లా, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News