జాతీయ స్థాయిలో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపిఎస్సీ ) లో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన లలిత్ అంబిక జైన్ సత్తా చాటింది. దీంతో అంబికకు ఐఏయస్ క్యాడర్ రావడం ఖాయం. 2022 ఏడాది లో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో లలిత్ కుమార్ లంబిక జైన్ కు 69 వ ర్యాంక్ సాధించింది. 2021 లో నిర్వహించిన సివిల్స్ లో అంబిక జైన్ కు 128 వ ర్యాంక్ వచ్చింది. మహారాష్ట్ర కు ఐపిఎస్ క్యాడర్ ఇచ్చారు. ఎలాగైనా ఐఏఎస్ సాధించాలనే లక్ష్యంతో తిరిగి సివిల్స్ రాసింది.ఈసారి రాసిన సివిల్స్ పరీక్షలలో 69 వ ర్యాంక్ వచ్చింది. అంబిక అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఎమ్మిగనూరు పట్టణంలోని బంగారు బజారులో నివాసం ఉంటున్న లలిత్ కుమార్, అనిత దంపతుల కుమార్తె అంబిక జైన్ 25( ఏళ్లు) నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఎమ్మిగనూరు లోని గుడ్ షప్పర్డ్ స్కూల్ చదివారు. ఇంటర్ లో( హెచ్ఈజే) హిస్టరీ, ఎకనమిక్స్, జియోగ్రఫి, (బీఏ) హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ లో చదివారు. ఎంఏ ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యునివర్సిటీ చదివారు. మొదటిసారి 2020 లో సివిల్స్ రాయాల్సి ఉండగా కరోనా వలన వాయిదా పడింది. ఆ తరువాత 2021 లో 128 ర్యాంక్ రాగా 2022 లో 69 వ ర్యాంక్ సాధించి ఔరా అనిపించింది.
69th ranker: సివిల్స్ లో సత్తా చాటిన ఎమ్మిగనూరు వాసి అంబిక జైన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES