AP Maoists Surrender: ఏపీ డీజీపీ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ దళంతో కలిసి లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడించారు. మావోల లొంగుబాటుతో రాష్ట్రం ఇప్పుడు నక్సల్స్ ఫ్రీ స్టేట్‌గా మారిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట సోమవారం 9 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ పరిణామంతో ఏపీని మావోయిస్టు రహిత రాష్ట్రంగా డీజీపీ ప్రకటించారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ (స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన చెల్లూరి నారాయణరావు ఉన్నారు. నారాయణరావుతో పాటు మరో ఎనిమిది మంది సభ్యులు జనజీవన స్రవంతిలో కలిశారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/salman-khan-next-movie-with-vamshi-paidipally-and-dil-raju/
ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం నారాయణరావుకు రూ. 25 లక్షల రివార్డు అందనుంది. మిగిలిన సభ్యులకు వారి కేడర్‌ను బట్టి రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు రివార్డులు లభిస్తాయి. తక్షణ సహాయంగా డీజీపీ ఒక్కొక్కరికి రూ. 20,000 నగదును అందజేశారు. లొంగిపోయిన మావోల నుంచి ఒక ఇన్సాస్ రైఫిల్, రెండు BGLలు, ఐదు .303 రైఫిళ్లు సహా మొత్తం 19 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్చి 31, 2026 గడువు లోపు మావోయిజం నిర్మూలన లక్ష్యంలో భాగంగా ఈ లొంగుబాటు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

