Pawan Kalyan| ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు భారీ ఊరట దక్కింది. గతంలో పవన్ కళ్యాణ్‌పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ గుంటూరు ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని పవన్ వ్యాఖ్యానిచారంటూ 2023, జులై 29న గుంటూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ కల్యాణ్‌పై 499, 500 ఐసీసీ సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.. అయితే దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కానీ తాజా విచారణలో తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు చెప్పడంతో ఈ కేసును ఎత్తివేస్తూ గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు ఉత్తర్వులు ఇచ్చారు.
కాగా ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ నేతలు ఈ విషయంలో పవన్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆపేసిన విషయం విధితమే.