Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Dadisetti Raja: వైసీపీ కీలక నేత దాడిశెట్టికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ

Dadisetti Raja: వైసీపీ కీలక నేత దాడిశెట్టికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ

Dadisetti Raja| వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు ఏపీ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జర్నలిస్టు హత్య కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో పోలీసులు ఆయనను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. కాగా ఐదేళ్ల క్రితం జరిగిన జర్నలిస్టు హత్య కేసులో తుని రూరల్‌ పోలీసులు రాజాపై కేసు నమోదు చేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది.

- Advertisement -

అసలు ఏం జరిగిందంటే..?

తుని నియోజకవర్గం తొండంగి మండలంకు చెందిన కాతా సత్యనారాయణ(47) ఆంధ్రజ్యోతి జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అక్టోబర్ 15న తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా కొందరు దుండగులు అడ్డగించి కత్తితో నరికి చంపారు. ఈ హత్యకు దాడిశెట్టి రాజా సూత్రధారి అనేది మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదుచేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దాడిశెట్టి సహా ఆరుగురిని నిందితులుగా చేర్చారు. కానీ రాజా మంత్రి అయ్యాక 2023లో ఛార్జిషీటులో నిందితుల జాబితా నుంచి ఆయన పేరు తప్పించారని సమాచారం.

దీంతో సత్యనారాయణ సోదరుడు, న్యాయవాది కాతా గోపాలకృష్ణ రాజాపై చర్యలు తీసుకోవాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌హెచ్‌ఆర్‌సీతో పాటు హైకోర్టును ఆశ్రయించారు. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రి నారా లోకేష్ చొరవతో దాడిశెట్టి రాజాపై పోలీసులు మరోసారి కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News