AP Teachers Singapore Visit: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభ కనబరిచిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయుల బృందం మే 4 నుంచి మే 9 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది. సింగపూర్‌లోని అత్యాధునిక విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, సెకండరీ పాఠశాలల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ పర్యటనను ఖరారు చేశారు.
డిజిటల్ లెర్నింగ్ టెక్నిక్స్, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ప్రాజెక్ట్ బేస్డ్ టీచింగ్, కొత్త మూల్యాంకన పద్ధతులపై ఉపాధ్యాయ బృందం ప్రత్యేక దృష్టి సారించనుంది. సింగపూర్ పర్యటన అనంతరం, జూన్ లేదా జూలై నెలల్లో మరో ఉపాధ్యాయుల బృందాన్ని ఫిన్లాండ్ పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Also Read: https://teluguprabha.net/telangana/defamation-case-filed-against-kamareddy-mla-venkata-ramana-reddy/
ఇప్పటికే ఏపీ మంత్రుల బృందం కూడా సింగపూర్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడి డిజిటల్ గవర్నెన్స్, పరిపాలనా విధానాలపై అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఉపాధ్యాయుల ఈ పర్యటన ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా నాణ్యత మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

