బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(BGT) సిరీస్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) అదరగొడుతున్న సంగతి తెలిసిందే. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో అద్భుతమైన సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) నగదు బహుమతి ప్రకటించింది. ACA ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. త్వరలోనే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నగదు బహుమతిని అందజేస్తామని తెలిపారు.
నేటి యువతకు నితీశ్ ఆదర్శమని.. ఇలాంటి యువ క్రికెటర్లను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. అంతేగాక ఏపీకి కూడా ఐపీఎల్ టీమ్‌ను సిద్ధం చేసేలా ఆలోచన చేస్తున్నామన్నారు. ఇక దేశంలోనే అత్యాధునిక వసతులతో కూడిన స్టేడియంను అమరావతిలో నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడే విధంగా విశాఖ స్టేడియంను తీర్చిదిద్దుతున్నట్లు కేశినేని వెల్లడించారు.