Tirupati Accident: తిరుపతిలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గరుడ వారధి ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు బైక్‌పై వేగంగా ప్రయాణిస్తూ కిందపడిపోయారు. సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడటంతో వారిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/hyderabad-woman-scam-ysrcp-leader-name-attack-victims/
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే గరుడ వారధి ఫ్లైఓవర్‌పై యువకులిద్దరూ బైక్‌పై వేగంగా ప్రయాణిస్తూ బలంగా గార్డ్ రైల్‌ను ఢీకొన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన ఇద్దరు యువకులు తిరుపతికి చెందిన విద్యార్థులుగా సమాచారం.


