ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan kalyan)ను ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) కలిశారు. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా పవన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం పవన్ కల్యాణ్‌ను రాజేంద్ర ప్రసాద్ సన్మానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

