Sunday, April 20, 2025
Homeఆంధ్రప్రదేశ్Sri Reddy: పోలీస్‌స్టేషన్‌కి శ్రీరెడ్డి.. ఎందుకో తెలుసా..?

Sri Reddy: పోలీస్‌స్టేషన్‌కి శ్రీరెడ్డి.. ఎందుకో తెలుసా..?

విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌కు.. నటి శ్రీ రెడ్డి ఇటీవల విచారణకు హాజరయ్యారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, వీడియోలు పెట్టినట్లు ఆరోపణల నేపథ్యంలో, ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసు చుట్టూ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో విచారణ జరగగా, సెక్షన్ 410 ప్రకారం నోటీసులు జారీ చేసి ఆమెను పంపించారు.

- Advertisement -

ఈ సంఘటన రాష్ట్ర రాజకీయ వర్గాలతో పాటు సామాజిక వేదికల్లోనూ చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో, ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, శ్రీ రెడ్డి తరచుగా సోషల్ మీడియా వేదికగా విపక్ష నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, వివాదాస్పద వీడియోలు షేర్ చేస్తూ వస్తారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిపాలన మారిన తర్వాత, టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, శ్రీ రెడ్డి తన స్వరాన్ని మార్చుకుంటూ, నైతికత పట్ల అవగాహన కలిగినట్లుగా సోషల్ మీడియా పోస్ట్‌లను షేర్ చేయడం ప్రారంభించారు. ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోబోతున్నారన్న ఊహాగానాలు రావడంతో, అధికార పార్టీ స్పందనపై కూడా ప్రజల్లో ఆసక్తి పెరిగింది. అయితే మొదటి నెలలో ఆమెపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా శ్రీ రెడ్డి మీద ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో కర్నూలు టూ టౌన్, కృష్ణా జిల్లా గుడివాడ, విశాఖపట్నం, చిత్తూరు, విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అయితే ఈ కేసుల్లో నమోదు చేసిన సెక్షన్లు ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించిన వైనందున, బెయిలబుల్ నేరాలుగా హైకోర్టు అభిప్రాయపడింది. 2025 ఫిబ్రవరి 24న ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది.

చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పిటిషన్ విచారణార్హత లేదంటూ తిరస్కరించిన కోర్టు, విశాఖపట్నం కేసులో మాత్రం రూ.10,000 బాండ్, ఇద్దరు ష్యూరిటీలు సమర్పించే షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఈ పరిణామాలు శ్రీ రెడ్డి కేసును మరింత రాజకీయం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలపై ప్రజా స్పందన, రాజకీయ నాయకుల విమర్శలతో కలిపి.. ఈ కేసులు ఏ దిశగా మలుపు తిరుగుతాయో అన్నది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News