వివిధ ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలను చూసి టిడిపి కార్యకర్తలు అదైర్యపడవద్దని టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కోరారు. సోమవారం ఆదోని సీట్ బిజెపికి కేటాయిస్తూ వస్తున్న వార్తలను చూసి టీడీపీ కార్యకర్తలు భారీ స్థాయిలో మీనాక్షి నాయుడు ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మీనాక్షి నాయుడు మాట్లాడుతూ పూర్తిస్థాయిలో అధికార ప్రకటన వచ్చేవరకు అందరూ శాంతియుతంగా, అధైర్యపడకుండా ఉండాలని పిలుపునిచ్చారు. తనకు ఇప్పటికీ విశ్వాసం ఉందని, సీట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
