చిన్ననాటి చిలిపి ఎన్నటికీ జ్ఞాపకంగా మిగులుతాయి…అప్పట్లో చిలిపి చేష్టలు తలచుకుంటే నేడు నవ్వులుగా మిగిలాయి…అనూహ్యంగా తెలియని వయస్సులో విడిపోయి…22 ఏళ్ల తర్వాత కలవడం మనసులో ఆనందం..భాధ…జీవితం ఎవరికి శాశ్వతం కాదు కానీ జ్ఞాపకాలు చివరి శ్వాస వరకు జ్ఞమకమే…రూపు మారిన అదే ఉత్సాహం….పలకరింపు…చదువుకున్న పాఠశాల మూతపడిన మా మనస్సులో నుండి తొలగించలేదు అంటూ అక్కడే సమావేశం…వివరాల్లోకి వెళితే…ఆదోని పట్టణం జిహ్వేశ్వర పాఠశాలలో 22 సంవత్సరాల క్రితం 2001_2002 బ్యాచ్ కు చెందిన 10 వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక.
వయస్సు రీత్యా వివిధ ప్రాంతాల్లో నివస్తున్నప్పటికి మరల పాత స్నేహితులను చూడాలన్న ఆకాంక్షతో తరలివచ్చారు. పాత జ్ఞాపకాలతో ముచ్చటించి ఆనందభాష్పాలతో పలకరించుకున్నారు. చదువుకున్న తరగతి గదులకు వెళ్లి ఆనాటి గుర్తులు నెమరేసుకున్నారు.
అనంతరం తమ గురువులైన నాగరాజ్,ధనుంజయ,వెంకటేష్,నరసింహులు, నాగవేణి, శాంతకుమారి లను ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కొర్రపాటి సురేంద్ర, నరసింహులు, చంద్రహాస్, చంద్ర, రామకృష్ణ, ఉమ, రేఖ, విమల తదితరులు పాల్గొన్నారు.