Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Adoni: స్పందనలో నిర్లక్ష్యం అస్సలుండరాదన్న సబ్ కలెక్టర్

Adoni: స్పందనలో నిర్లక్ష్యం అస్సలుండరాదన్న సబ్ కలెక్టర్

స్పందన కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులకు పలు సూచనలు సూచించారు. వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ సూచించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు స్పందనలో పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామ స్థాయి పూర్తి అయ్యే సమస్యలు డివిజన్ స్థాయి వరకు వస్తున్నారు. నాణ్యతతో గ్రామస్థాయిలోనే సమస్యలను పరిష్కరించాలన్నారు. మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ వారంలోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.
మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని.
ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామానికి చెందిన కురువ భూపాల్ సంబంధించి సర్వేనెంబర్ 31 – బి1- బి నందు 0.90 సెంట్ల భూమి వారసత్వంగా సంక్రమించినది. ప్రస్తుతం మా ప్రక్కన పోలం వారు 0.18 సెంట్ల భూమిని ఆక్రమణకు గురి చేశారని విచారణ చేసి సమస్యను పరిష్కరించవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.
గ్రామంలో ఆర్.డి.టి సంస్థ వారు ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణం చేసి ఇస్తున్నారు కావున మాకు గతంలో ఇచ్చిన ఇంటి పట్టాలను తీసుకొని నూతన పట్టాలను మంజూరు చేస్తే ఇంటి నిర్మాణం జరుగుతుందని ఆదోని మండలం చిన్న హరివాన గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీకి సంబంధించిన గ్రామస్తులకు అర్జీ సమర్పించుకున్నారు.
కోసిగి మండలం నెల – కోసిగి గ్రామానికి చెందిన నర్సింహులు సంబంధించి సర్వేనెంబర్ 123 పైకి 2.60 ఎకరాలు భూమికి సంబంధించి ఆన్లైన్ నమోదు చేయుట కొరకు అర్జీ
మంత్రాలయం మండలం చిలకలదోన గ్రామానికి చెందిన హనుమంతమ్మ సంబంధించి నందవరం మండలం హాలహర్వి గ్రామంలో సర్వేనెంబర్ 36/డి 1బి నందు 4.46 ఎకరాల భూమికి సంబంధించి ఆర్వార్ మరియు అడంగల్ నందు వేరే వారీ పేరు ఉన్నది విచారణ చేసి నా యొక్క పేరు నమోదు చేయవలసినదిగా అధికారులను ఆదేశించడం జరిగినది
కార్యక్రమంలో పాల్గొన్న పరిపాలన అధికారి గోవింద్ సింగ్, డి ఎల్ పి ఓ నూర్జహాన్, డిప్యూటీ డి ఎం హెచ్ వో సత్యవతి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, డిప్యూటీ తాసిల్దార్ రమాదేవి, ఆర్ డబ్ల్యూ యస్ ఎ.ఈ చేతన్ ప్రియ, మున్సిపల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News