Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Adoni: రాష్ట్రంలో అధికారం మార్పు తథ్యం

Adoni: రాష్ట్రంలో అధికారం మార్పు తథ్యం

వైసిపి అరాచక పాలన పట్ల ప్రజలు విసిగెత్తిపోయారని రాష్ట్రంలో టిడిపి అధికారం చేపట్టడం తథ్యమని మాజీ ఎమ్మెల్యే టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి మీనాక్షి నాయుడు ధీమా వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యకర్తలు, అభిమానులతో ఉత్సాహంగా టిడిపి ఇన్చార్జ్,మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో ఆయన స్వగృహం ముందు టీడీపీ నాయకులు, కార్యకర్తలు బారి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. అక్కడి నుండి మీనాక్షి నాయుడు, ఉమాపతి నాయుడు, భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీగా ఎన్టీఆర్ విగ్రహానికి, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ విగ్రహానికి పూలహారం వేసి ఘన నివాళి అర్పించారు. అక్కడ నుండి మీనాక్షి నాయుడు నివాసంకు పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసి జిల్లాలో దిగ్విజయంగా సాగుతుందన్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, స్నేహితులు పాదయాత్రలో భాగస్వాములు కాబోతున్నారన్నారు.

- Advertisement -

లోకేష్ పాదయాత్రకి ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించిందని, అన్నింటినీ అధిగమించి పాదయాత్ర విజయవంతంగా సాగిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ యువగళానికి సంఘీభావంగా పాదయాత్ర జరిగిందన్నారు యాత్రలో కులమతాలకు అతీతంగా ప్రజలతో లోకేష్ మమేకమవుతున్నారన్నారు. జగన్ పాలనకు ముగింపు పలకటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ఎవరు అధైర్య పడవద్దని ధైర్యం నింపారు కార్యక్రమంలో నాయకులు బుద్ధారెడ్డి, బత్తిని కుబేర్నాథ్, మారుతి నాయుడు, సిద్ధార్థ నాయుడు, తిమ్మప్ప, వెంకటేష్, లక్ష్మీనారాయణ, రంగన్న, జయరాం, రంగస్వామి నాయుడు, కృష్ణారెడ్డి, జగదీష్, శేషి రెడ్డి, బసవ, మహమ్మద్, మహిళ నాయకురాలు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News