Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్Aghori: జనసేన పార్టీ కార్యాలయం వద్ద మహిళా అఘోరి హల్‌చల్

Aghori: జనసేన పార్టీ కార్యాలయం వద్ద మహిళా అఘోరి హల్‌చల్

Aghori| కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న మహిళా అఘోరి మరోసారి హల్ చల్ చేసింది. మంగళగిరిలోని కారు వాష్ సెంటర్‌లో తన కారు వాష్ చేయిస్తుండగా ఓ జర్నలిస్టు వీడియో తీశారనే కారణంతో అతడిపై దాడి చేసింది. పెద్ద కర్రతో దాడి చేస్తుండగా పక్కన ఉండే వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆమె ఆగలేదు.

- Advertisement -

అనంతరం జాతీయ రహదారిపై ఉన్న జనసేన(Janasena) కార్యాలయం వద్ద రోడ్డుపై భైఠాయించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసే దాకా ఇక్కడి నుంచి వెళ్లనని తెలిపింది. దీంతో కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. వారిపైనా దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. . కాగా మొన్నటి వరకు తెలంగాణలో హల్ చల్ చేసిన అఘోరి ప్రస్తుతం ఏపీలోని పలు ఆలయాలను సందర్శిస్తూ హల్ చల్ చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News