Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Vizag AI Data Center: ఆ దేశాలు కాదంటే ఇక్కడికొచ్చిందా...ఏఐ హబ్ వెనుక ఏం జరిగింది

Vizag AI Data Center: ఆ దేశాలు కాదంటే ఇక్కడికొచ్చిందా…ఏఐ హబ్ వెనుక ఏం జరిగింది

Vizag AI Data Center విశాఖపట్నం వేదికగా గూగుల్-అదానీ సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న భారీ ఏఐ హబ్ సెంటర్ కోసం ఇవాళ ఒప్పందం జరిగింది. దేశంలోని ఐటీ రంగానికి ఇదో మైలు రాయిగా అభివర్ణిస్తున్నారు. అయితే కొన్ని దేశాలు నో చెబితేనే ఈ ప్రాజెక్టు ఇక్కడికొచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

గూగుల్ క్లౌడ్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా అదానీ కనెక్ట్స్ జాయింట్ వెంచర్ ద్వారా విశాఖపట్నంలో 1 గిగావాట్స్ సామర్ధ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి ఇవాళ ఢిల్లీ వేదికగా ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, గూగుల్ ప్రతినిధులు హాజరయ్యారు. రానున్న ఐదేళ్లలో గూగుల్-అదానీ సంస్థలు 1 లక్ష 33 వేల కోట్లు ఖర్చు పెట్టనున్నాయి. విశాఖలో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్‌కు చెందిన 12 ఏఐ నెట్‌వర్క్ సెంటర్లలో ఒకటి కానుంది.

గతంలో రెండు సార్లు శంకుస్థాపనలు..

అయితే అదానీ సంస్థ డేటా సెంటర్ ప్రతిపాదన కొత్తది కాదు. ఇది పాత ప్రాజెక్టే. ఇప్పుడు కొత్తగా గూగుల్‌తో భాగస్వామ్యమైంది. గతంలో అంటే 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు స్వయంగా అదానీ సంస్థకు 200 మెగావాట్ల డేటా సెంటర్ స్థాపన కోసం భూమి కేటాయించి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అధికారంలో వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా అగ్రిమెంట్ చేసింది. మరోసారి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అంటే దాదాపు ఆరేళ్లుగా ఈ ప్రాజెక్టు విశాఖలో వస్తుందనే ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ఇప్పుడైనా నిర్మాణం జరుగుతుందో లేదో అనేది సందేహమే.

ఆ దేశాలు నో చెబితే ఇక్కడి కొచ్చిందా..

అయితే గూగుల్ ఏఐ హబ్ సెంటర్‌ను తొలుత గూగుల్ సంస్థ ఐర్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, చిలీ, ఉరుగ్వే, మెక్సికో దేశాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే విద్యుత్ వినియోగం అధికంగా ఉండటంతో ఐర్లాండ్ తిరస్కరించింది. ఇక నెదర్లాండ్స్‌లో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ దేశం డేటా సెంటర్లకు నో చెప్పింది. పవర్ గ్రిడ్స్ దెబ్బ తింటాయనే కారణంతో డెన్మార్క్ కూడా నో చెప్పింది. ఆ తరువాత లాటిన్ అమెరికా దేశాలైన చిలీ, ఉరుగ్వే, మెక్సికోలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా ప్రజలు, పర్యావరణ వేత్తల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో గూగుల్ సంస్థ వెనక్కి తగ్గింది. ఇక డేటా సెంటర్ నుంచి నిరంతరం వచ్చే ఎమిషన్స్, శబ్ద కాలుష్యం, అధిక నీటి వినియోగం, వందల ఎకరాల భూమి కేటాయింపు వంటి కారణాలతో అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం కడా కాదంది. ఈ దేశాలన్నీ కాదనడంతో మూడో ప్రపంచ దేశాలుగా భావించే ఆఫ్రికా, ఆసియాలపై సంస్థ దృష్టి సారించింది. విశాఖను వేదికగా ఎంచుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad