Air India: విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్(Ix- 2658) విమానానికి పెను ప్రమాదం తప్పింది. పైలట్ అప్రమత్తతతో 103 ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. గురువారం మధ్యాహ్నం 2.20 గంటలకు విశాఖలో టేకాఫ్ అయిన కాసేపటికే మార్గమధ్యలో ఫ్లైట్ రెండో ఇంజిన్ ఫ్యాన్ రెక్కల్లోకి పక్షి దూరింది. గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరిగి విమానాన్ని విశాఖ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
పైలట్ చాకచక్యం కారణంగా విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలోని ప్రయాణికుల కోసం ఎయిరిండియా సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అయితే, విమానం టేకాఫ్ అయిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకోవడంతో ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.


