ఈనెల 12వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై చర్చించి ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేసి వాటిని వెంటనే భర్తీ ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సిఆర్ భవన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టంలో వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగు సంవత్సరాల గడుస్తున్నా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏమాత్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని దీనివలన ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావడంలో ఆలస్యం జరుగుతుందని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ శాఖలో ఖాళీలు మొత్తం భర్తీ చేస్తామని నిరుద్యోగులను నమ్మించి వారి ఓట్లను దండుకొని అధికారం చేపట్టి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా తాను నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన ముఖ్యమంత్రి నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఏమైంది అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ పోస్టులు మినహాయించి ఏ ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వలేదని ఎస్సై కానిస్టేబుల్ ఆరువేల పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించి క్వాలిఫై అయిన వేలాదిమంది అభ్యర్థులు ఈవెంట్స్ కు ఎదురు చూస్తూ ఉంటే ఇప్పటివరకు ఈవెంట్స్ నిర్వహించకుండా నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చలగాటమాడుతుందని ఆయన విమర్శించారు అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహించడంతోపాటు గ్రూప్1,2, పోస్టులు పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని మెగా డీఎస్సీ ద్వారా 55 వేల ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రతి జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచిత కోచింగ్, మెటీరియల్ రాష్ట్ర ప్రభుత్వమే అందించాలని, ఉద్యోగ అవకాశాలకు వయోపరిమితి 45 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తూ రేపటినుండి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రులకు ఎస్ఎంఎస్ లు (ఎస్ ఎం ఎస్) పంపించడం, ఎమ్మెల్యేలకు మంత్రులకి వినతి పత్రాలు సమర్పిస్తామని జరుగుతుందని ఆ నిరసనలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులను ఏక తాటిపైకి తెచ్చి కలిసి వచ్చే విద్యార్థి యువజన సంఘాలతో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు నగర అధ్యక్ష కార్యదర్శులు బాబయ్య, బీసన్న, నాయకులు శేషన్న చంటి హుస్సేన్ భాష తదితరులు పాల్గొన్నారు.
AIYF: మంత్రివర్గంలో ఉద్యోగాల భర్తీపై చర్చించాలి
ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES