‘బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమము ప్రజల భాగస్వామి కూడా ఉండాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ శిక్షణా తరగతులకు పార్టీ నియమించిన ట్రైనర్స్ హాజరయ్యారు. వార్డులలో పోలింగ్ బూత్ వస్తాయి ఓటర్ల నమోదుపై ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాలని పట్టణంలో జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రి అఖిలప్రియ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా భూమి అఖిలప్రియ మాట్లాడుతూ టిడిపి అంటేనే సంక్షేమ అభివృద్ధి అని స్పష్టం చేశారు. టిడిపి గుర్తు సైకిల్ సంక్షేమం ఒక చక్రం అభివృద్ధి మరొక చక్రమని ఆమె అభివర్ణించారు. నాడు అద్భుతంగా పురోగమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు పాతాళానికి పడిపోయిందని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న విధానాలకు పేదలు మరింత పేదలుగా మారారని ప్రజల భవిష్యత్తును ప్రభుత్వం చీకటిమయం చేసిందని రాష్ట్రంలో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకే భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో పథకాలు ప్రకటించారన్నారు. అనంతరం ట్రైనర్స్ ఓటర్ వెరిఫికేషన్ మరియు ఆర్డీఎస్ వాట్సాప్ గ్రూపులలో విశిష్టతను గురించి క్లస్టర్ ఇన్చార్జిలకు యూనిటీ ఇన్చార్జిలు బిఎల్ఎ బూతు లెవెల్ ఏజెంట్లకు అవగాహన కల్పించారు. కొత్త ఓటర్లు నమోదు తో పాటు ఇతర అంశాలను క్షుణ్ణంగా వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాజీ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి మాజీ జెడ్పిటిసి యామా గుర్రప్ప, టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.