Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Akhilapriya: ఒక అవకాశమని ప్రజలను మోసం చేశారు జగన్

Akhilapriya: ఒక అవకాశమని ప్రజలను మోసం చేశారు జగన్

సర్పంచుల నిధులు దోచుకొని గ్రామాల అభివృద్ధికి అడ్డంకిగా మారారు

రాష్ట్ర ప్రజల స్థితిగతులు మారాలన్నా రాష్ట్రం అప్పుల ఊబిలో నుండి బయట పడాలన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు.
ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటింటికి వెళ్లి ఇంటిల్లిపాదిని ఆప్యాయంగా పలకరించి టిడిపి విడుదల చేసిన మినీ మేనిఫెస్టో గురించి ప్రజలకు ఆమె వివరించారు.

- Advertisement -


ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఒక అవకాశం అంటూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని రాష్ట్ర అభివృద్ధిని మరిచి కుంటుపరుస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలందరూ గమనించాలని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడుని గెలిపించుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని అన్నారు.


గ్రామ సర్పంచ్ నిధుల నుండి డబ్బులు దోచుకుని గ్రామంలో సర్పంచులు ఒక్క చిన్న పని కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉండిపోయారన్నారు. గ్రామాల అభివృద్ధి చెందాలన్న రాష్ట్ర అభివృద్ధి చెందాలన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలందరూ గమనించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.
టిడిపి అధికారంలోకి వస్తే మహాశక్తి పథకం కింద 18 సంవత్సరాలు నిండిన స్త్రీలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు అందజేస్తామని అలాగే తల్లికి వందనం పథకం క్రింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15 వేలు అందిస్తామని అలాగే దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా టికెట్ లేని ప్రయాణం సాధ్యమన్నారు. టిడిపి నాయకులు మాధవరెడ్డి, కౌన్సిలర్ హుస్సేన్ భాష, బొమ్మిరెడ్డి, పాపిరెడ్డి ప్రసాద్ , రామ సుబ్బారెడ్డి, టిడిపి కార్యకర్తలు భూమా అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News