Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Akhilapriya: చంద్రబాబుకు బెయిల్ వచ్చేదాకా పోరాటం ఆగదు

Akhilapriya: చంద్రబాబుకు బెయిల్ వచ్చేదాకా పోరాటం ఆగదు

' మేము సైతం' అంటూ బాబుకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. అది జీర్ణించుకోలేక కక్ష సాధింపు కోసం వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టిందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ఆళ్లగడ్డలోని తమ స్వగృహం వద్ద బాబుకి ‘మేము సైతం’ అంటూ చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఎవరూ లేని సమయంలో అక్రమంగా ఆయనను అరెస్టు చేయడానికి ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం మంత్రులు ఎమ్మెల్యేలు, టపాకాయలు కాల్చుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారని వారి హోదాను మరిచి ప్రవర్తిస్తున్న తీరును ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి అఖిలప్రియ పేర్కొన్నారు.

- Advertisement -

దీక్షలో బంగారు రాము యాదవ్, కౌన్సిలర్ హుస్సేన్ భాష మాజీ జెడ్పిటిసి చాంద్ బాషా, సిద్ధం రెడ్డి జాఫర్ రెడ్డి, నాగిరెడ్డి పల్లె శేఖర్ రెడ్డి, బీరువాల భాస్కర్, శ్రీనివాసరెడ్డి, సోమల శేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ వీరన్న, గుంప్రమాన్ దీన్నే సర్పంచ్ మోహన్ రెడ్డి, కూడాలా నారాయణరెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు భూమా అభిమానులు పాల్గొన్నారు.

రిలేనిరాహార దీక్షకు న్యాయవాదుల సంఘీభావం
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మద్దతుగా రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆమెకు మద్దతుగా ఆళ్లగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు రమణయ్య ఉపాధ్యక్షుడు మురళీధర్ గౌడ్ కార్యదర్శి శివప్రసాదరావు న్యాయవాదులు శ్రావణి ,లత, నరసయ్య ,వెంకటయ్య, రఘురాం రెడ్డి వెంకటేశ్వర్లు సుదర్శన్, అసిస్టెంట్లు జాకీర్ గోల్డ్ ,అజయ్ రిలే నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News