Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Weather Update: అలెర్ట్.. రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Weather Update: అలెర్ట్.. రానున్న మూడు రోజుల్లో వర్షాలు

- Advertisement -

Weather Update: దక్షణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుంది. రానున్న మూడు రోజులలో ఇది పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక తీరంవైపు వెళ్లే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో దక్షణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

నిజానికి ఇది పశ్చిమంగా పయనించి గురువారానికే తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని అంచనా వేశారు. ఆ తరువాత ఈనెల 17 వరకు అదే తీవ్రతతో పశ్చిమంగా పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఇది తీవ్ర అల్పపీడనం కాకపోగా అల్పపీడనంగానే కొనసాగుతుంది. ఇక, దీని ప్రభావం కూడా పశ్చిమ తీరంపై వుండదని నిపుణులు చెప్తున్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad