Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్Allagadd: చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం

Allagadd: చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలకు నిరసనంగా చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. సిరివెళ్ల మండల కేంద్రంలోని కటిక సెంటర్లో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ, పేదలకు జగన్ అన్న ప్రభుత్వం ఇచ్చే సెంటు స్థలం పై అనుచిత వ్యాఖ్యలు చేసి అభాసు పాలైన చంద్రబాబు నాయుడు అభాసుపాలయ్యారని పేదల కోసం ఇచ్చే స్థలాల పైన కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ ఉపన్యాసం చేయడం ఎంతవరకు సబబని ఆయన అన్నారు. ప్రతిదీ రాజకీయం చేస్తే ప్రజలు చీ కొడుతున్నారని ఎమ్మెల్యే గంగుల తెలిపారు. అనంతరం శిరివెళ్లలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వసీమ్, జడ్పిటిసి మెంబర్ దిల్షాద్ ,సలాం ,సర్పంచ్ లక్కాకుల సాలమ్మ ఉపసర్పంచ్ ఇంతియాజ్, రఫీ, నజీర్ ,వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News