చాగలమర్రి మండలం ఓజీ తాండ గ్రామంలో జరిగిన మహారాజ్ సేవాలాల్ స్వామి ఆలయ ప్రతిష్టా కార్యక్రమానికి ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానికి లంబాడి మహిళలు తమ సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తూ ఎమ్మెల్యేను పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గంగుల నాని మహారాజ్ సేవాలాల్ స్వామి, మారెమ్మ గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధి అన్ని విధాల జరగాలని దేవత లకు వేడుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్ , మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ ఉప్పలపాటి రవి , సర్పంచులు బాలీశ్వర్ రెడ్డి , గోవిందయ్య, ఎంపీటీసీ శంకరి భాయ్, ఓ జి తాండ వైసిపి నాయకులు శ్రీరామ్ నాయక్, జయరాం నాయక్, కృష్ణా నాయక్, స్వామి నాయక్, తిరుపాల్ నాయక్, రాముడు ఢీ వనిపెంట గ్రామ వైసిపి నాయకులు వీరయ్య, శ్రీధర్, సుబ్బయ్య, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.