జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో మరోసారి రాజకీయ సెగ రాజుకుంది. ప్రముఖ న్యాయవాది అయిన గోగిశెట్టి వైసీపీలో చేరతారా అంటూ అందరూ అదే చర్చించుకుంటున్నారు. గోగిశెట్టి బయోగ్రఫీని ఓసారి మనం తెలుసుకుందాం..
డాక్టర్ గోగిశెట్టి నరసింహారావు ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల మండలం వీరారెడ్డి పల్లె గ్రామంలో గోగిశెట్టి నరసింహారావు జన్మించారు. చిన్నతనం నుండే చదువుపై మక్కువగా శ్రద్ధ, ఆసక్తి కనపరిచేవారు. విద్యాభ్యాసం వీరారెడ్డి పల్లె, గోవిందపల్లి, కర్నూలు, గుంటూరు, హైదరాబాదులో జరిగింది. చిన్నతనం నుండే ఉన్నత చదువు చదవాలని పట్టుదలతో స్వశక్తితో ఎదగాలని దృఢ సంకల్పంతో ఉన్నత చదువులు చదివారు. హైకోర్టు న్యాయవాది వృత్తిలో రాణిస్తూ అటు సేవ కార్యక్రమాలు వ్యాపారం వంటి వాటిని విజయవంతంగా నిర్వహిస్తూనే అంచలంచలుగా ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే స్వభావం గోగిశెట్టి నరసింహారావులో ఉండటం ఆయన ఎదుగుదలకు మరింత ప్రధాన కారణం అంటారు ఆయన్ను బాగా దగ్గరినుంచి చూసినవారు. తనను ఇంత వానిగా చేసిన సొంత ఊరు, సొంత మండలం, సొంత నియోజకవర్గం, సొంత జిల్లాకు ఏదైనా చేయాలని ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేస్తూ, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, కులము, మతము ప్రాంతాలకు అతీతంగా సేవా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గోగిశెట్టి.
ఇటీవల పలు సేవ కార్యక్రమాలలో పాల్గొన్న గోగిశెట్టి నరసింహారావును జిల్లాలోని బలజ సంఘీయులు రాజకీయాల్లోకి ఆహ్వానించారు. నంద్యాల జిల్లాలలో 2,60,000 బలిజ సంఘీయుల ఓటర్లు ఉన్నారు. అత్యధిక మెజార్టీ ఉన్న ఓటర్లైన బలిజ సంఘం కాపు వారందరి చూపు గోగిశెట్టి నరసింహారావు పైన పడింది. స్నేహశీలి, ఆత్మీయుడు, మృదు స్వభావి, ఆపద్బాంధవుడు, విద్యావేత్త, ఆదర్శవంతుడు..ఇలా అన్ని అర్హతలున్న గోగిశెట్టి తమ పార్టీలో చేరితే రాజకీయంగా మరింత లాభమని అన్ని పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీల కన్ను ఇప్పుడు ఆయన వైపే పడ్డాయి. ఇటీవల కొన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేగా అయినా ఎమ్మెల్సీగా అయినా టికెట్ ఇస్తామంటూ ఆయనతో నేరుగా సంప్రదించినట్లు సమాచారం. ఇక స్థానికులేమో ప్రస్తుతం ఉన్న నాయకులతో అలసిపోయి, కొత్త నేతకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇందుకు సరైన అభ్యర్థి డాక్టర్ గోగిశెట్టి నరసింహారావేనని, అందరికీ ఆమోదయమైన వ్యక్తిగా ప్రజల చూపు ఆయన వైపే ఉన్నాయనేది రాజకీయ పార్టీలు తేల్చిన లెక్క. ఆళ్లగడ్డలో జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయనను ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు పలువురు అభినందించారు.
ఇటీవల తన స్వగ్రామంలో గోగిశెట్టి నరసింహారావు జన్మదిన వేడుకలు స్వగృహం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ జన్మదిన వేడుకలకు నియోజకవర్గం జిల్లా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి ప్రముఖ రాజకీయ నాయకులు, ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, విద్యావేత్తలు, అభిమానులు తరలిరాగా.. వారందరి సమక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.
ఈ వేడుకల్లో భాగంగానే ఆయన మీడియాతోనూ ముచ్చటించారు. ప్రజల అభీష్టం మేరకు ఇతర కార్యక్రమాలలో పాల్గొంటానని, రాజకీయ రంగ ప్రవేశాన్ని నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు, అందరి సలహాలు సూచనలు పాటించాకే తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశం ఖాయమనే ఊహాగానాలకు రెక్కలొచ్చాయి. గోగిశెట్టి ఏ పార్టీ చేరుతారో అన్నది అతి త్వరలోనే తేలుతుందని ఇటు రాజకీయ పార్టీలు అటు స్థానికులు అంచనా వేస్తున్నారు.