నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో తెలుగుదేశం పార్టీ హామీలు ఇస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ టిడిపి అధికారంలోకి వస్తే మహాశక్తి పథకం కింద 18 సంవత్సరాలు నిండిన స్త్రీలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు అందజేస్తామని అలాగే ‘తల్లికి వందనం’ పథకం క్రింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15 వేల రూపాయలు అందిస్తామన్నారు. ‘దీపం’ పథకం కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ……. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా టికెట్ లేని ప్రయాణం ఇస్తాము అలాగే ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ‘యువగళం’ నిది కింద నెలకు 3000 రూపాయలు అందిస్తామని..టిడిపి అధికారంలోకి వస్తే ప్రజలకు ఉపయోగపడే మరెన్నో పథకాలను అమలు చేస్తామని ఇప్పుడు విడుదల చేసిన పథకాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు హామీ ఇస్తున్నట్టు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు.
ఒక్క ఛాన్స్ అని చెప్పుకొని అధికారులకు వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని పథకాల పేరుతో ప్రజలకు కోతలు కోస్తున్నారని అమ్మఒడి కింద ఒక ఇంట్లో ఎంతమంది స్కూల్ కి వెళ్తే అంతమందికి అమ్మఒడి ఇస్తామని మాట తప్పిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే ఒక అమ్మ ఒడిలోనే మళ్లీ 2000 రూపాయలు కూతకొస్తూ ఎంతోమంది పిల్లలకి వారి తల్లిదండ్రుల పేరుతో విద్యుత్ ఛార్జీలు ఎక్కువ వచ్చాయంటూ ఎంతో మందికి అమ్మఒడిని తీసివేయడం జరిగింది కావున ప్రజలందరూ గమనించి రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయని వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం తద్యమని అన్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.