Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆళ్లగడ్డ పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేద్దాం

ఆళ్లగడ్డ పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేద్దాం

గడప గడపకులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలు తెలిపిన పలు సమస్యలు, పూర్తి చేయవలసిన పలుఅభివృద్ధి కార్యక్రమాలపై సచివాలయం సిబ్బంది స్థానిక కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నాయకులతో ఎమ్మెల్యే గంగుల బ్రిజెంద్రా రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే గంగులతో పాటు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కే రామలింగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నాయిబ్ రసూల్ ,మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు విజయ మిల్క్ డైరీ చైర్మన్ ఎస్పీ జగన్ మోహన్ రెడ్డి, కౌన్సిలర్ గోట్లూరు సుధాకర్ రెడ్డి, పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సమావేశంలో ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు తెలిపిన పలు సమస్యలు డ్రైన్లు, రోడ్లు, విద్యుత్ లైన్లు
పలు అంశాలపై అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే గంగుల ఆదేశించారు. ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి ఉండకూడదని పనులని త్వరగా పూర్తి చేయాలని, ఆయన తెలిపారు. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కే రామలింగారెడ్డి పట్టణ అభివృద్ధి పై మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రామలింగారెడ్డి,విజయ పాల డైరీ ఛైర్మన్ జగన్మోహన్ రెడ్డి, కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి సింగం వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ రమేష్ గౌడ్ చెన్నయ్య,ఏఈ సురేంద్రనాధ్ రెడ్డి, కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు,సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, బాలస్వామి వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad