Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: యువత విద్యపై దృష్టి సారించాలి: డాక్టర్ గోగిశెట్టి నరసింహారావు

Allagadda: యువత విద్యపై దృష్టి సారించాలి: డాక్టర్ గోగిశెట్టి నరసింహారావు

హైకోర్టు న్యాయవాది ప్రముఖ డాక్టర్ గోగిశెట్టి నరసింహారావు 52వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సిరివెళ్ల మండలం వీరారెడ్డి పల్లె గ్రామంలో గోగిశెట్టి నరసింహారావు స్వగృహంలో ఆత్మీయులు బంధువులు స్నేహితులు నాయకులు విద్యావేత్తలు అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి . ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందరి సమక్షంలో ఆనందోత్సవాల మధ్య డాక్టర్ గోగి శెట్టి నరసింహారావు జన్మదిన కేకును కట్ చేశారు. ఉదయం నుండే నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి ఇతర జిల్లా నుండి ఇతర రాష్ట్రాల నుండి నాయకులు అభిమానులు తరలివచ్చి తమ అభిమాన నాయకుడైన మానవతావాది సేవా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ గోగిశెట్టి నరసింహారావు కు జన్మదిన వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. తరలివచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ గోగి శెట్టి నరసింహారావు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తను పుట్టింది ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని సిరివెళ్ల మండలం వీరారెడ్డి పల్లి లో నిరుపేద కుటుంబంలో జన్మించానని వీరారెడ్డిపల్లి గోవిందపల్లి విద్యాభ్యాసం చేశానని అనంతరం ఉన్నత చదువులకు గుంటూరు హైదరాబాద్ కర్నూల్ ప్రాంతాల్లో చదివినట్లు ఆయన తెలిపారు పుట్టిన ఊరు పెరిగిన ఊరును మరిచిపోనని తనను ఇంత వానిగా చేసిన ఈ నియోజకవర్గానికి ఏమి చేసినా తక్కువేనని అందులో భాగంగా కొంతలో కొంతైనా ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు నియోజకవర్గ కౌలు రైతులు అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా రైతుల ఎదగడానికి వ్యవసాయ అధికారుల కృషి చేయాలి అన్నారు రైతులను అన్ని రకాల ఆదుకునేందుకు అవగాహన సభలు ఏర్పాటు చేసి రైతుల అభివృద్ధి చేస్తామన్నారు ముఖ్యంగా యువత చదువుపై దృష్టి సారించాలని అలాగే ఉపాధి రంగాలపై రాణించాలని కోరారు అందరి దీవెనలు ప్రజల అందరి కోరికల మేరకు రాబోయే దినాలలో ప్రజల అభీష్టం మేరకు ఇతర ఇతర కార్యక్రమాలలో పాల్గొంటానని రాజకీయ రంగం ప్రవేశం నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు అందరి సలహాలు సూచనలు పాటించి తగు నిర్ణయం తీసుకుంటానని డాక్టర్ నరసింహారావు తెలిపారు. ఆత్మీయుల అందరి సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని డాక్టర్ గోగిశెట్టి నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి బ్రహ్మానంద రెడ్డి సింగం భరత్ రెడ్డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News