Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: నారా లోకేష్ 'యువగళం' జయప్రదం చేద్దాం

Allagadda: నారా లోకేష్ ‘యువగళం’ జయప్రదం చేద్దాం

ఆళ్లగడ్డ నియోజకవర్గం లోకేష్ యువగళం పాదయాత్ర ఈనెల 22, 23 తేదీల్లో జరగనున్నదని టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని భూమా నివాస ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు, అభిమానులతో చర్చించారు. ఈ సందర్భంగా భూమా విఖ్యాత్ మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర కని విని ఎరుగని రీతిలో ఏర్పాటు చేద్దామన్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి వచ్చి, లోకేష్ యాత్రను దిగ్విజయం చేద్దామని భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కోరారు. అంతకు ముందు దొర్నిపాడు మండల కేంద్రంలో మండల నాయకులు ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో భూమా జగత్ పాల్గొని, లోకేష్ యువగళం పాదయాత్రకు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపు ఇచ్చారు భూమ జగత్ విఖ్యాత్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News