Sunday, September 29, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: వైసీపీని వీడి టిడిపిలోకి చేరిన 230 కుటుంబాలు

Allagadda: వైసీపీని వీడి టిడిపిలోకి చేరిన 230 కుటుంబాలు

శిరివెళ్ళ మండలం చెన్నూరు గ్రామ పంచాయితి మరియు మాజర గ్రామం ఇసుకపల్లి గ్రామాలకు చెందిన వైస్ సర్పసంచ్ మేకల వెంకటేశ్వర్లు, చెన్నూరు గ్రామానికి చెందిన క్రిష్ణ మూర్తి పాటు రెండు గ్రామాలకు సంబంధించి మరో 230 కుటుంబాలు వైసిపి నీ వీడి టిడిపి లో చేరారు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. వైస్ సర్పంచ్ మేకల వెంకటేశ్వర్లు, బండారు కృష్ణమూర్తి, మధుసూదన్, రామకృష్ణ, గోపాలకృష్ణ ,సుదర్శన్,జలందర్ ,వెంకటేశ్వర్లు, పెద్ద పుల్లయ్య, సుబ్బయ్య, మళ్లీ ,శంకరయ్య, తదితరులు చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లా ముగించుకుని నంద్యాల జిల్లాలో అడుగు పెట్టారని లోకేష్ పాదయాత్ర గురించి గ్రామాల్లో ఎక్కడ చూసినా పాదయాత్ర గురించి చర్చలు చేసుకోవడం జరుగుతుందన్నారు.
వైసిపికి ఒకసారి అవకాశం అంటూ ప్రజలు పెద్ద ఎత్తున 151 సీట్లు గెలిపించి అధికారాన్ని చేతిలో పెట్టారు కానీ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేసారు ఇంకా ఎమ్మెల్యేల పరిస్థితి వస్తే గ్రామాల్లోని ప్రజల సమస్యలు పక్కనపెట్టి జగన్ మోహన్ రెడ్డితో ఒక సెల్ఫీ ఫోటో దిగితే చాలు అనుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఉన్నారని, ఎమ్మెల్యేలకు అభివృద్ధి కన్నా జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీ దిగడమే ముఖ్యమని భూమా అఖిల ప్రియ అన్నారు. ఆళ్లగడ్డకు ఎన్నడు లేని విధంగా నీచ సంస్కృతి తీసుకు వచ్చి డబ్బు రాజకీయాలకు పాల్పడుతూ చివరికి మొగుడు పెళ్ళాలు పంచాయతీ కూడా డబ్బులు వసూలు చేసే నీచే సంస్కృతిని తీసుకువచ్చిన స్థాయికి ఆళ్లగడ్డ
ఎమ్మెల్యే ఉన్నారన్నారు.
రాష్ట్రంలో ఎమ్మెల్యే పరిస్థితి మళ్లీ ఎమ్మెల్యే అవుతామో కామమో అనే విధంగా ఇంత నీచ రాజకీయాలకు దిగజారారన్నారు. వైసిపి ప్రభుత్వం రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని ఈ మధ్యకాలంలో అకాల వర్షం వడగండ్ల వానతో దెబ్బతిన్న రైతులకు ఇంతవరకు ఏ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం ఈ ప్రభుత్వం అందించలేదని మండిపడ్డ అఖిలప్రియ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా ఈ ప్రభుత్వం తయారుచేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా గంజాయికి అలవాటు పడే విధంగా ప్రభుత్వం యువతను తయారు చేస్తుందన్నారు. గ్రామ అభివృద్ధిని మరిచి చివరకు సర్పంచ్ నిధులు కూడా ఈ ప్రభుత్వం దోసుకు తింటుందని ప్రజలు చొక్కాలు పట్టుకుని అడిగే రోజులు దగ్గర వచ్చాయని ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని రాష్ట్రం బాగుపడాలి గ్రామాలు అభివృద్ధి చెందాలనుకున్నవారు టిడిపిలోకి రావచ్చని, అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవచ్చని భూమా అఖిలప్రియ అన్నారు. ఈ కార్యక్రమంలో భార్గవరామ్ , శ్రీకాంత్ రెడ్డి, టిడిపి నాయకులు అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News