Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: ఆ దమ్ము, ధైర్యం జగన్ కే ఉంది: గంగుల

Allagadda: ఆ దమ్ము, ధైర్యం జగన్ కే ఉంది: గంగుల

ప్రజా సంక్షేమ పథకాలు చక్కగా అమలు చేసే దమ్ము, ధైర్యం జగన్ సర్కారుకు మాత్రమే ఉందని గంగుల సోదరులు అన్నారు. చాగలమర్రిలో జరిగిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా గృహ సారథుల సమావేశంలో ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బ్రిజేంద్ర రెడ్డి పాల్గొన్నారు. గృహసారథులు సచివాలయ కన్వీనర్లు వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వివరాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. కులం మతం పార్టీ వర్గం చూడకుండా జగన్ సంక్షేమ పథకాలను ఎలా అందిస్తున్నారో ప్రజలకు వివరించాలని వారు కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలు 98.5% నెరవేర్చిన ఘనత దేశ చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. వచ్చే నెల 13 న జరిగే పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని గంగుల సోదరులు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News