ఆళ్లగడ్డ పట్టణంలోని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో బిజెపిని వీడి టిడిపిలో చేరారు సింగం భరత్ రెడ్డి. భరత్ మద్దతుదారులైన దాదాపు 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా సింగం భరత రెడ్డి, వారి అనుచరులకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అఖిలప్రియ మాట్లాడుతూ.. గతంలో టిడిపిలో, మాతోనే సింగం భరత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారని, తిరిగి మా కుటుంబంలో చేరడం ఒక సభ్యుడుగా మేము ఆనందిస్తున్నామన్నారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. సింగం భరత్ రెడ్డి మాట్లాడుతూ ..టిడిపిలో చేరడం సొంత ఇంటికి చేరినట్లు ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భార్గవరామ్ భూమా జగద్విఖ్యాత రెడ్డి, టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.