రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పేర్కొన్నారు. చాగలమరి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఆవరణలో మూడవ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చాగలమర్రిలోని 318 పొదుపు సంఘాలకు 1,కోటి 63 లక్షల 59 వేల 571రూపాయల చెక్కును ఏపీ ముస్లిం మైనారిటీ జనరల్ సెక్రెటరీ షేక్ బాబూలాల్ ఎంపీపీ వీరభద్రుడు వైఎస్ఆర్సిపి కన్వీనర్ కుమార్ రెడ్డి ఏపీ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ గౌసియా, జెడ్పిటిసి లక్ష్మీదేవి తదితరులతో కలిసి పొదుపు సంఘాల గ్రూపులకు పంపిణీ చెక్కును అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పొదుపు సంఘాల అక్క, చెల్లెమ్మలతో కలిసి పాలాభిషేకం చేశారు గంగుల బ్రిజెంద్రా రెడ్డి.
2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి జెండా ఎగరవేస్తారని అక్క చెల్లెమ్మలు అవ్వ తాతల ఆశీర్వాదాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలపాలని ఎమ్మెల్యే గంగుల కోరారు. ఈ కార్యక్రమంలో బోర్వెల్ రమణ గణేష్ రెడ్డి సర్పంచు తులసమ్మ రాష్ట్ర మహిళ డైరెక్టర్ బాలవిద్య ఎంపీటీసీ పత్తి నారాయణ, ఆశీర్వాదం, శేషు రసూల్, ఖాదర్ బాషా, స్వామి రెడ్డి, కోఆర్డినేటర్ దానం, ఏపీఎం నాగమ్మ, వైఎస్ఆర్సిపి మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.