Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: వైసిపిపై ప్రజల తిరుగుబాటు మొదలైంది

Allagadda: వైసిపిపై ప్రజల తిరుగుబాటు మొదలైంది

రాష్ట్రంలో YCP ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతే కాకుండా తిరుగుబాటు మొదలైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం 100 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా చాగలమర్రి పట్టణంలో స్థానిక నాయకులతో కలసి సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. గాంధీ సెంటరుకు చేరుకున్నాక గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేశారు… ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్ర చేయలేడని కామెంట్స్ చేసిన వారు ఈ 100రోజుల పాదయాత్రలో ఆయన ఉత్సాహాన్ని చూసి భయపడుతున్నారన్నారు. యువగళం పాదయాత్రలో రాయల సీమలో పర్యటిస్తూ రైతులు, యువత సమస్యలను తెలుసుకుంటూ వెంటనే వాటికి పరిష్కార మార్గాలను సూచించడం జరుగుతుందన్నారు. రాయలసీమలో తాగు, సాగు నీటి సమస్యలను తెలుసుకుని తెదేపా అధికారంలోకి వచ్చాక వాటికి శాస్వత పరిష్కారం జరిగేలా చంద్రబాబునాయుడుతో ఎప్పటికప్పుడు చరవాణిలో చర్చిస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకతతో పాటు తిరుగుబాటు మొదలైందన్నారు. కార్యక్రమంలో టీడీపీ ఆళ్లగడ్డ పరిశీలకులు. శివుడు యాదవ్, తెదేపా మైనార్టిసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్సర్ బాషా, మండల కన్వీనర్‌ లాయర్ నరసింహారెడ్డి,టిఎన్‌టియుసి రాష్ట్ర కార్యదర్శి గుత్తి నర్సింహులు,ఆళ్ళగడ్డ నియోజకవర్గ ఐటీడీపీ ఉపాధ్యక్షురాలు శజ్ఞారెడ్డి,నంద్యాల జిల్లా బిసి సెల్‌ స్పోక్‌ పర్సన్ సల్లానాగరాజు, టిడిపి నాయకులు కొలిమి హుసేన్‌వళి, షరీఫ్‌, హనీఫ్‌, మౌళాలి, జెట్టి నాగరాజు, సుధాకర్,టైలర్‌ ఖాధర్‌, బషీర్‌, నాగుర్‌, గఫార్, మాబులాల్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News