Homeఆంధ్రప్రదేశ్Arrest : అర్ధరాత్రి అరెస్టుతో ఆలూరులో అగ్గి.. పరామర్శకు వెళ్తే పాశవిక బంధనాలా?

Arrest : అర్ధరాత్రి అరెస్టుతో ఆలూరులో అగ్గి.. పరామర్శకు వెళ్తే పాశవిక బంధనాలా?

ఆలూరు (తెలుగు ప్రభ): “అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి అరెస్టా? ఇదేనా ప్రజాస్వామ్యం?” అంటూ వైస్సార్సీపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చాయి. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్సీలు మధుసూదన్ రెడ్డి, మంగమ్మ, మాజీ కడీసీబీ చైర్మన్ పామిడి వీరయ్య, మాజీ మేయర్ బీవీ రామయ్య, వైయస్సార్సీపి రాష్ట్ర మహిళా నాయకురాలు శశికళ కృష్ణమోహన్ నేతృత్వం వహించి వందలాది మంది కార్యకర్తలు “కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్”, “సీఎం చంద్రబాబు డౌన్ డౌన్”, “రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు” అంటూ నినాదాలతో చిప్పగిరి అంబేద్కర్ సర్కిల్ వద్ద భారీ బైఠాయింపు నిర్వహించారు.

- Advertisement -

సంగాల గ్రామంలో వైస్సార్సీపీ నేత గిరి ఇంటిపై టీడీపీ నేత నాగరాజు దాడి చేశాడు. బాధితుడిని పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షి పై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాముడు కి చేయి విరిగింది.కానీ దాడి చేసిన వారిని వదిలేసి, పోలీసులు రాత్రి  ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే తో పాటు కొడుకు చంద్రశేఖర్ ను కూడా చిప్పగిరి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.

బుట్టా రేణుక ఫైర్  : “తప్పు చేసిన గూండాలను కాపాడి, ప్రజల పక్షాన నిలబడిన ఎమ్మెల్యే పై కేసు పెడతారా? ఇది పచ్చి కక్షసాధింపు. వెంటనే విరూపాక్షి గారిని విడుదల చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం” అని బుట్టా రేణుక హెచ్చరించారు.ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News