కాంగ్రెస్ పార్టీ అగ్రనేత భావి ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఆలూరు నియోజకవర్గంలో అడుగు పెట్టి అక్టోబరు 18 అనగా ఈ రోజు సంవత్సరం పూర్తి చేసుకున్న తరుణంలో ఆలూరు అసెంబ్లీ కో- ఆర్డినేషన్ కమిటీ సభ్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన భారి బైకు ర్యాలీ, అభినందన సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు కె బాబు రావు, నంద్యాల జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కర్నూలు జిల్లా అధ్యక్షులు కె బాబు రావు మాట్లాడుతూ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని కర్ణాటక ఫలితాలే నిదర్శనం అని తెలిపారు. అణగారిన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని దేశ ప్రజలు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా కోరుకుంటున్నారని తెలిపారు. నంద్యాల జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికి వెళ్ళి వివరిస్తామని, రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టి మెాడీ కాళ్ళ దగ్గర మెాకరిల్లుతున్నారని రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి కరుణాకర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరచి అవినీతి కోరల్లో చిక్కుకుందని, వీరి అవినీతి అక్రమాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించలేకపోతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఆలూరు అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం అని ఆరు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. వేదావతి ప్రాజెక్టును పూర్తి చేస్తే జిల్లాలోని అయిదు నియెాజకవర్గాలు 196 గ్రామాలు 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని కాని ఇక్కడ పనులు చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
HLC, LLC, హంద్రీనీవా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మించి రైతులను ఆదుకున్నది కోట్ల విజయ్ భాస్కర రెడ్డి మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వలేనని గుర్తు చేశారు. ఆలూరు పట్టణంలో విద్య అందని ద్రాక్ష గా మిగిలిపోయిందని విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలంటే బళ్ళారి, ఆదోని, కర్నూలు అనంతపురం పట్టణాలకు వెళ్ళి చదవాలని కనీసం డిగ్రీ, ఐటిఐ కళాశాలలకు పక్కా బిల్డింగులు నిర్మాణం పూర్తి చేసి విద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఆలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరెస్తామని ధీమా వ్యక్తం చేశారు.
👉 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లాజరాస్, ఆలూరు మండల అధ్యక్షులు తుంబలబీడు లక్ష్మన్న, గుంతకల్లు ఇంచార్జీ దౌల్తాపురం ప్రభాకర్, పత్తికొండ ఇంచార్జీ క్రాంతి నాయుడు, చిప్స్ భాష, సీనియర్ నేత ఆలాం నవాజ్, గాలి మల్లికార్జున, నంద్యాల జిల్లా సోషల్ మీడియా నాయకులు నరసింహ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు చిప్పగిరి వినోద్ కుమార్, చిప్పగిరి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఖాజీపురం రాంబాబు, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు ఈరన్న, కుమార్, ఆలూరు ఎస్సి సెల్ అధ్యక్షులు ఉరకుంద, చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, సాంబశివుడు, శ్రీనివాస్, నరసింహులు, అమరేష్, ప్రభు, కృష్ణ, మూర్తి, లోకేష్, రమేష్ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.