Sunday, April 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Aluru: జయరాంపై కోట్ల సుజాతమ్మ మండిపాటు

Aluru: జయరాంపై కోట్ల సుజాతమ్మ మండిపాటు

కార్మిక శాఖ మంత్రి జయరాంపై మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఫైర్ అయ్యారు. ఆలూరు టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మీడియా సమావేశం నిర్వహిస్తూ.. గతాన్ని మరిచి టీడీపీ నేత నారా లోకేష్ పై జయరామ్ అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నాడని సుజాతమ్మ ఆరోపించారు. నీవు MPTC ఓడిపోతే ZPTC గా గెలిపించింది తెలుగు దేశం పార్టీనే అన్న విషయం జయరాం గుర్తుంచుకోవాలన్నారు. ఓటమి, గెలుపు సహజమని.. పదవులు శాశ్వతం కాదన్న ఆమె
నారా లోకేశ్ పై అసభ్యకరంగా మాట్లడడం సంస్కారం కాదని హితవు పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News