Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Aluru: సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం

Aluru: సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం

రైతు భరోసా కేంద్రం ప్రారంభం

సచివాలయం వ్యవస్థ దేశానికే ఆదర్శమని చెందుతాయని వైయస్సార్ సీపీ ఆలూరు సమన్వయకర్త విరుపాక్షి అన్నారు. మండల పరిధిలోని హత్తిబేళగల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని విరుపాక్షి ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సచివాలయ సిబ్బంది పనితీరుపై ఆయన సమీక్షించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలములో అందించాలని లక్ష్యంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఒకేసారి 1.40 లక్షలు ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన తెలిపారు. సచివాల వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామాలలోని సమస్యలు పరిష్కరించేందుకు ఎంతో ఉపయోగ పడుతుందని ఆయన తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లను నియమించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే చేర్చడం హర్షించదగ్గ విషయమన్నారు.

నవరత్నాల్లో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ చేయూత, ‌ వైయస్సార్ ఆసరా, చేదోడు చేదోడు, తదితర సంక్షేమ ప్రవేశపెట్టి పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి కే సాధ్యమైందని ఆయన తెలిపారు. టిడిపి నేత నారా చంద్రబాబు నాయుడు ఎన్ని ఉచిత హామీలు ఇచ్చిన ప్రజలు నమ్మరని ఆయన తెలిపారు. టిడిపి పై ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన జ్యోస్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చిన్న ఈరన్న, కో కన్వీనర్ వీరేష్, వైఎస్సార్ సీపీ యూవీ నాయకుడు కిశోర్, చిప్పగిరి ఎంపీపీ మారయ్య, ఆలూరు జెడ్పీటీసీ సభ్యుడు ఏరురూ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News