దేశవ్యాప్తంగా 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గృహానికి కుళాయి ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ జల్ జీవన్ మిషన్ పథకం అమలులో భాగంగా జెజెఎస్, 2023 కు సంబంధించి బెస్ట్ ఫెర్పార్మింగ్-ఫాస్టెస్ట్ మూవింగ్ అనే రెండు కేటగిరీల్లో మొదటి అర్ధ సంవత్సరానికి డా. వైయస్సార్ కడప, విశాఖపట్నం జిల్లాలు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకుల్లో నిలిచాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి తెలియజేశారు. గత అక్టోబరు 1 నుండి 2023 మార్చి 31 వరకూ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్స్ కేటగిరీలో హై అచీవర్స్ కింద డా.వైయస్సార్ కడప జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 75 నుండి 100 శాతం మధ్య గృహాలకు కుళాయి కనక్షన్లు కల్పించడం ద్వారా 1/20 ర్యాంకుతో నిలిచిందని తెలిపారు.అదే విధంగా విశాఖపట్నం జిల్లా ఆస్పిరేషనల్ జిల్లాల విభాగంలో 50 నుండి 75 శాతం మధ్య గృహ కుళాయి కనక్షన్ల కవరేజి విషయంలో 1/21 ర్యాంకుతో నిలిచిందని పేర్కొన్నారు.అలాగే విశాఖపట్నం జిల్లా అచీవర్స్ విభాగంలో 50 నుండి 75శాతం గృహ కుళాయిల కవరేజ్ అంశంలో 3/168 ర్యాంకుతో నిలిచిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. ఈ అర్ధ సంవత్సర ర్యాంకులు రానున్న వార్షిక జాతీయ ఉత్తమ ర్యాంకుల ఖరారులో దోహదం చేస్తాయని జల్ జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి రాష్ట్రానికి వ్రాసిన లేఖలో పేర్కొన్నట్టు సిఎస్ తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన జిల్లాలకు సంబంధించిన ప్రసంశా పత్రాలని కేంద్ర జల్ జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి వికాస్ షీల్ తన లేఖ ద్వారా రాష్ట్రానికి పంపినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి తెలియజేశారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ దేశానికి అవసరమైన తాగునీరు మరియు పారిశుద్ధ్య అవసరాలను తీర్చడానికి రెండు ప్రధాన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అనగా అవి స్వచ్ఛ భారత్ మిషన్- గ్రామీణ్ (ఎస్బియం-జి) మరియు జల్ జీవన్ మిషన్ (జెజెయం)ఎస్బియం-జి సంపూర్ణ పారిశుధ్యాన్ని అందించడం ద్వారా గ్రామీణ భారత దేశాన్ని ఓడిఎఫ్ ప్లస్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంటే జెజెయం ద్వారా ప్రతి ఇంటికి నాణ్యమైన కుళాయి నీటి సరఫరాను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఎస్బియం మరియు జెజెయం రెండింటిలో పర్యవేక్షణ మరియు మూల్యాంకన యంత్రాంగాలలో ఒకటి అసెస్‌మెంట్ సర్వేలు అంటే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ఎస్జి) మరియు జల్ జీవన్ సర్వేక్షణ్ (జెజెఎస్), ఇవి ఎస్బియంలో వాటి పనితీరు ఆధారంగా రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు వాటి జిల్లాలను ర్యాంకింగ్ చేస్తాయి.
Amaravathi: ‘జల్ జీవన్ సర్వేక్షన్’ కింద జిల్లాలకు ఉత్తమ ర్యాంకులు:సిఎస్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES