Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్Amaravati- Avakai: 'అమరావతి-ఆవకాయ్' ఉత్సవాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Amaravati- Avakai: ‘అమరావతి-ఆవకాయ్’ ఉత్సవాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Amaravati- Avakai Festival: తెలుగు సినిమా, సాంస్కృతిక, కళా, సాహిత్య మేళవింపుగా విజయవాడలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ‘అమరావతి- ఆవకాయ్‌ ఉత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రారంభించారు. ఆవకాయ అనగానే ముందుగా గుర్తుకువచ్చే పేరు ఆంధ్రప్రదేశ్‌ అని ఆయన అన్నారు. ఈ ఉత్సవాల్లో 28 ప్రత్యేక ఈవెంట్లు, 4 వర్క్‌షాపులు నిర్వహించనున్నారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/centralized-kitchen-across-telangana/

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమరావతి- ఆవకాయ్’ ఉత్సవాలను విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు అధికారికంగా ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలను ఆనవాయితీగా కొనసాగించాలని.. తెలుగు జాతి ఔన్నత్యాన్ని, సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలని సీఎం సూచించారు. జనవరి 8 నుంచి 10 వరకు జరిగే ఈ ఉత్సవం జరగనుంది. సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే అమరావతి-ఆవకాయ్ ఉత్సవాల ముఖ్య ఉద్దేశ్యం.

Also Read: https://teluguprabha.net/national-news/pm-modi-somnath-temple-shaurya-yatra-1000-years/

ఈ కార్యక్రమంలో యూరోపియన్ యూనియన్ ఎక్స్ లెన్సీ అంబాసిడర్ హాగ్ టెలిఫిన్‌తో పాటు మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమా, వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, ఐఏఎస్ అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాగ్ టెలిఫిన్ మాట్లాడారు. అమరావతి- ఆవకాయ్ ఉత్సవాల ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. కళాకారుల నృత్యాలు, కృష్ణమ్మకు హారతి ఇవ్వడం మంచి అనుభూతి కలిగించాయన్నారు.

‘భారత్‌, యూరప్ దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. భారతీయ సినిమాలు అనగానే ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ ఎంతో పాపులర్. ఇప్పటికీ మా దేశ ప్రజలు ఆ సాంగ్‌కి స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేయడం చూశాం. కూచిపూడి నృత్యానికి ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉండటం విశేషం. అమరావతి- ఆవకాయ ద్వారా అనేక అంశాలను ఒక చోట ప్రదర్శించడం అద్భుతంగా ఉంది. ఇటీవల కొన్ని కీలకమైన అంశాల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.’ అని టెలిఫిన్‌ వివరించారు. 

విజయవాడలోని ఆహ్లాదకరమైన ప్రకృతి, గలగలా పారే కృష్ణమ్మ తీరాన ‘అమరావతి-ఆవకాయ్’ ఉత్సవాలు సీఎం చంద్రబాబు ఎంతో ఘనంగా ప్రారంభించారని మంత్రి కందుల దుర్గేశ్‌ ప్రశంసించారు. ఈ మూడు రోజులు నృత్యాలు, సాహిత్యం వంటి అంశాలపై అనేక ప్రదర్శనలు నిర్వహిస్తామని.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఈ కార్యక్రమానికి తరలి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. క్రియేటివ్ ఎకానమీ పెంచుకోవాలంటే టూరిజం అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని.. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను ఆనందంగా తిలకించి ప్రజలు ఆస్వాదించాలని కోరారు.  

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News