Saturday, November 15, 2025
HomeTop StoriesAmaravati Debts: అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్, అమరావతి కోసం మరో 32 వేల కోట్ల అప్పులు

Amaravati Debts: అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్, అమరావతి కోసం మరో 32 వేల కోట్ల అప్పులు

Amaravati Debts: ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోతోంది. అమరావతి నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం మరో 32 వేల కోట్ల రుణానికి సిద్ధమైంది. పెండింగులో ఉన్న మెడికల్ కళాశాలల నిర్మాణం కోసం 5 వేల కోట్లు భారంగా భావించిన ప్రభుత్వం అమరావతి కోసం 32 వేల కోట్లు అప్పు తీసుకుంటోంది. అందుకే ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. అమరావతి నిర్మాణం కోసం 91,639 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. ఇదంతా అప్పులతోనే సమీకరించనుంది. మొత్తం 112 రకాల పనులుంటాయనేది అంచనా. ఇందులో ఇప్పటికే 87 రకాల పనులకు సంబంధించి 53,388 కోట్లకు టెండర్లు పిలిచారు. ఇప్పటికే ప్రారంభమైన పనులకు సంబంధించి దాదాపు 4 వేల కోట్లు ఇప్పటికే ఖర్చు చేసింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకు, హడ్కో నుంచి దాదాపుగా 31 వేల కోట్లు అప్పుు చేసింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో 32 వేల కోట్లు సమీకరించనున్నామని సీఆర్డీఏ స్పష్టం చేసింది. ఈ 32 వేల కోట్లను ప్రపంచ బ్యాంకు-ఏడీబీ బ్యాంకు నుంచి 14 వేల కోట్లు కాగా, నాబార్డ్ నుంచి 7 వేల కోట్లు, NABFID నుంచి 10 వేల కోట్ల రూపాయలు తీసుకోనుంది. ప్రపంచబ్యాంకు-ఏడీబీ ఇప్పటికే 15 కోట్లు మంజూరు చేశాయి. ఇప్పుడు మరో 14 వేల కోట్లు తీసుకోనుంది.

గతంలో అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 91 వేల కోట్ల రుణాలు చేయడం విమర్శలు దారితీస్తోంది. రానున్న కాలంలో మరో 55 వేల ఎకరాలు సేకరిస్తామని చెబుతున్నప్పుడు అమరావతి నిర్మాణ వ్యయం 91 వేల కోట్లను దాటిపోయే పరిస్థితి ఉంది. ఇంకా ఎన్ని వేల కోట్లు కావల్సి వస్తుందనేది తీవ్రమైన అంశంగా మారింది. మరోవైపు బడ్జెటేతర వ్యయం ఇప్పటికే వివిధ సంస్థల పేరుతో 55 వేల కోట్లుగా ఉంది. దీనికి తోడు బడ్జెట్ వ్యయం 1 లక్షా 70 వేల కోట్ల వరకు ఉంది. ఈ లెక్కన ఏపీ ప్రభుత్వం కేవలం ఏడాదిన్నరలో భారీగా అప్పుల్లో కూరుకుపోయింది. వాస్తవానికి అమరావతి నిర్మాణాన్ని 60 వేల కోట్లతో పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం తెలిపింది. కానీ ఇప్పటికే 91 వేల కోట్లకు చేరుకుంది. రానున్న కాలంలో ఇది ఎక్కడికి వెళ్తుందనే సందేహాలు వస్తున్నాయి.

మెడికల్ కళాశాలకు 5 వేల కోట్లు లేవా

గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణంలో 7 పూర్తయ్యాయి. మిగిలిన 10 ప్రభుత్వ కళాశాలల్ని పూర్తి చేసేందుకు విడతలవారీగా 5 వేల కోట్లు కావల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ధికంగా భారమని, అంత డబ్బు లేదని చెబుతూ ఆ పది కళాశాలల్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పజెప్పేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం ఏవైతే కనీస నిత్యావసరాలో వాటికోసం కేవలం 5 వేల కోట్లు ఖర్చుపెట్టలేని ప్రభుత్వం…అమరావతి నిర్మాణం కోసం ఏకంగా గతంలో 31 వేల కోట్లు ఇప్పుడు మరో 32 వేల కోట్లు అప్పులు చేసేందుకు సిద్ధమైపోయింది. అందుకే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్వాకం తీవ్ర విమర్శల పాలవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad