Sunday, February 8, 2026
HomeTop StoriesAmaravati : అమరావతిలో సరికొత్త చరిత్ర.. తొలిసారి రాజధాని వేదికగా రిపబ్లిక్ డే వేడుకలు.. 

Amaravati : అమరావతిలో సరికొత్త చరిత్ర.. తొలిసారి రాజధాని వేదికగా రిపబ్లిక్ డే వేడుకలు.. 

Republic Day 2026 : నవ్యాంధ్ర రాజధాని అమరావతి మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో, విభజన తర్వాత విజయవాడ లేదా విశాఖపట్నం వంటి నగరాల్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఈ ఏడాది తొలిసారిగా అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో జరగనున్నాయి. ఈ నెల 26న నిర్వహించనున్న 77వ రిపబ్లిక్ డే వేడుకలను అత్యంత వైభవంగా, రాష్ట్ర ప్రతిష్టను చాటిచెప్పేలా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.

- Advertisement -

కోర్ క్యాపిటల్ ఏరియాలో పరేడ్ గ్రౌండ్ సిద్ధం : రాజధానిలోని మంత్రుల నివాస సముదాయం (మంత్రుల బంగ్లాలు) ఎదురుగా ఉన్న సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా పరేడ్ గ్రౌండ్‌ను సిద్ధం చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న ఈ పనుల్లో ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. మైదానాన్ని చదును చేయడం, పరేడ్ కోసం ట్రాక్ నిర్మించడం , వీఐపీల గ్యాలరీల పనులు చివరి దశకు చేరుకున్నాయి. అమరావతి నిర్మాణ పనులు ఊపందుకుంటున్న తరుణంలో, అదే ప్రాంతంలో ఈ వేడుకలు నిర్వహించడం ద్వారా రాజధానిపై ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

IND vs NZ: భారత గడ్డపై కివీస్ నయా చరిత్ర.. 37 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ కైవసం!
భారీ ఎత్తున అతిథులు – కట్టుదిట్టమైన భద్రత : ఈ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నారు. సుమారు 10 వేల మంది ప్రజలు ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు.

వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, పోలీసు బలగాల కవాతు , విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ సాధించిన అభివృద్ధిని, రాబోయే ప్రాజెక్టులను ప్రతిబింబించేలా శకటాల రూపకల్పన జరుగుతోంది.

రాజధానిలో పండుగ వాతావరణం : అమరావతిలో రిపబ్లిక్ డే నిర్వహించబోతుండటంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. రాజధాని గ్రామాల్లోని రైతులు, ప్రజలు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేడుకల సందర్భంగా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా మ్యాప్‌లను సిద్ధం చేయాలని , వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. గవర్నర్ గారు ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

 

Ratha Sapthami: రథసప్తమి ఎప్పుడు..ఎలా జరుపుకోవాలో తెలుసా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News