ఆయనకైనాఅర్థమైందా అని ఎద్దేవా చేశారు. స్టేజీ ఎక్కిన తర్వాత మొదటి 15 నిమిషాలు శ్లోకాలు చదువుతూ ఊగిపోయి మాట్లాడారని విమర్శించారు. పవన్ ప్రసంగంలో నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టామని వాస్తవం మాట్లాడారని తెలిపారు. టీడీపీని నిలబెట్టేందుకే జనసేన పుట్టిందనేది వాస్తవమని ఆరోపించారు.
21 సీట్లు గెలుచుకుని 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీలో టికెట్ దక్కనివారికి జనసేన టికెట్లిచ్చిందని సెటైర్లు వేశారు. గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు చంద్రబాబు మనుషులే అంటూ ఆరోపణలు చేశారు. ఇక చిరంజీవి తమ్ముడు కాకపోతే పవన్ పరిస్థితి ఏంటి అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబుకు ఊడిగం చేయటం కోసమే పవన్ కాపులను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఏరు దాటాక తెప్ప తెగలేసినట్లు వర్మపై నాగబాబు మాట్లాడారని విమర్శించారు. ఎన్నికల సమయంలో వర్మ చేతిలో చెయ్యి వేసి తనను గెలిపించాలని పవన్ కోరలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడేమో వర్మ.. మీ ఖర్మ అంటున్నారని మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరులా జనసేన మారిపోయిందన్నారు.