Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్మంత్రి నారా లోకేష్‌పై అంబటి ఆగ్రహం.. ఆ విషయంలో చంద్రబాబుని మించిపోయారంటూ విమర్శలు..!

మంత్రి నారా లోకేష్‌పై అంబటి ఆగ్రహం.. ఆ విషయంలో చంద్రబాబుని మించిపోయారంటూ విమర్శలు..!

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని లోకేష్ స్థాయిని మించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. మాజీ సీఎం జగన్‌పై లోకేష్ అభాసుపాలు చేసేలా వ్యాఖ్యానిస్తున్నారని అంబటి ఫైర్ అయ్యారు. కళ్ల నెత్తి ఎక్కినట్లు, వాపును బలం అనుకుని లోకేష్ మాటలు పెడుతున్నాడు. మీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలి అంటూ ఆయన హెచ్చరించారు.

- Advertisement -

టీడీపీ ఓటమికి లోకేష్ కూడా కారణమే: 2019 ఎన్నికల్లో టీడీపీ పరాజయానికి లోకేష్ కూడా కారణమని అంబటి పేర్కొన్నారు. పార్టీకి 23 సీట్లు వచ్చినప్పుడు లోకేష్ ఓడిపోయారు, కానీ కూటమికి 164 సీట్లు వచ్చినప్పుడు గెలిచారు. దీన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అంతేకాదు, అబద్ధాలు ప్రచారం చేయడంలో లోకేష్, చంద్రబాబును మించిపోతున్నారని ఎద్దేవా చేశారు.

జగన్ తెచ్చిన కంపెనీలను తన ఖాతాలో వేసుకుంటున్నారు: లోకేష్ వాస్తవాలను వక్రీకరిస్తున్నారని, జగన్ తెచ్చిన పెట్టుబడులను తనదిగా ప్రచారం చేసుకుంటున్నారని అంబటి విమర్శించారు. “దావోస్ వెళ్లి చంద్రబాబు, లోకేష్ నిజంగా ఎలాంటి కంపెనీలు తీసుకువచ్చారు.. జగన్ తీసుకొచ్చిన కంపెనీలను మాత్రం శంకుస్థాపన చేయడానికి సిద్ధమవుతున్నారు అంటూ ఆయన ప్రశ్నించారు.

లోకేష్ తన తండ్రి చంద్రబాబు 52 రోజుల పాటు జైలులో ఉన్నారని మర్చిపోకూడదని అంబటి అన్నారు. ముందుగా మీ మంత్రివర్గ సహచరులు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకో. జగన్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామని చెబుతున్నారు.. కానీ మిర్చి యార్డుకు వెళ్లినప్పుడు పోలీసులు ఆయనకు కనీస భద్రత కూడా కల్పించలేదని తెలిపారు.

మద్యం నాణ్యతపై ప్రజలు చంద్రబాబును తిట్టుకుంటున్నారని, టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 99 రూపాయల మద్యం అరగంటలోనే ప్రభావం తగ్గిపోతుందని అంబటి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
వక్ఫ్ బోర్డ్ బిల్లుపై వైసీపీ తీసుకున్న వైఖరిని కూడా అంబటి వివరించారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమైనందున మేం దాన్ని వ్యతిరేకించాం” అని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News