Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్Ambati Rambabu: హోంమంత్రి అనితపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

Ambati Rambabu: హోంమంత్రి అనితపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

Ambati Rambabu| ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anita) కులం గురించి వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రిపై అసభ్యకర పోస్టుల పెట్టారని తమ పార్టీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని తెలిపారు. అసలు తనకు కులం అంటే ఏంటో తెలియదని.. బైబిల్ పట్టుకు తిరుగుతానని అనిత ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటిది వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టే సరికి ఆమె ఎస్సీ అయిపోయారని విమర్శించారు.

- Advertisement -

ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే దుర్మార్గంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. పేరుకే అనిత హోంమంత్రి అని.. అంతా మంత్రి నారా లోకేశ్(Nara lokesh) చేతిలోనే ఉందని. సోషల్ మీడియాలో పోస్టుల పేరుతో వైసీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy)పై టీడీపీ నేతలు, కార్యకర్తలు పెట్టిన పోస్టులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. తమపై అసభ్య పోస్టులు పెట్టిన వారిపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో అంబటి ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News