బుక్కపట్నంలో తేరు సర్కిల్ వద్ద కాపు నాడు వైస్ ప్రెసిడెంట్ పెదరసు సుబ్రమణ్యం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కృష్ణ దేవరాయలు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అనంతపురం డిప్యూటీ మేయర్ దాసరి వాసంతి సాహిత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసంతి మాట్లాడుతూ ఈరోజు ప్రతి కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల వాళ్ళు ప్రతి రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు అని అన్నారు.
కష్టకాలంలో విజయనగర సామ్రాజ్యంలో చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన శ్రీ కృష్ణ దేవరాయలు పాలించిన తీరు మనకు ఆదర్శం అని అన్నారు. ఆయన చూపిన ఆర్థిక ప్రణాళిక, యుద్ధంలో ఆయన చూపించిన తెగువ, రాజ్యంలో ఉన్న ప్రజలను ఆదుకున్న విధానం నేటికీ మనకు మార్గదర్శకాలు అని అన్నారు. ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లగలిగే సత్తా శ్రీ కృష్ణ దేవరాయలు వారసులుగా మనకు ఉంది అని అన్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు సామాజికంగా మంచి స్థానం కల్పించడానికి అందరుంకృషి చేయాలి అని అన్నారు. అందరూ కలిసి కట్టుగా ముందుకు వెళదాం అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాపు నాడు వైస్ ప్రెసిడెంట్ సుబ్రమణ్యం, మురళి, నాగభూషణం, ఓబులేసు, లలిత కళా పరిషత్ సెక్రెటరీ పద్మజ, వివిధ జిల్లాల నాయకులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.