Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Ananthapuram: టిడిపి, వైసిపి మధ్య ఘర్షణ

Ananthapuram: టిడిపి, వైసిపి మధ్య ఘర్షణ

పరిటాల శ్రీరామ్ కు చేదు అనుభవం

అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు భగ్గుమన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ గొడవలు మొదలయ్యాయి. తాడిపత్రి పట్టణంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య గొడవలు మొదలయ్యాయి. తాడిపత్రి నియోజకవర్గంలో సాధారణ ఎన్నికలు జరుగుతుండడంతో తాడిపత్రి పట్టణంలో ఓ పోలింగ్ బూతులోకి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వెళ్లడం జరిగింది. దీంతో ఇద్దరూ ఒక్కసారి కలవడంతో మాటామాటా పెరిగి చివరకు వైసిపి కార్యకర్తలు, టిడిపి కార్యకర్తలు కలసి ఒకరిపై ఒకరు రాళ్లు వేసుకున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వాహనాలు కూడా రాళ్లు పడడంతో అద్దాలు పగిలిపోయాయి. తాడిపత్రిలో ఒక పోలింగ్ బూత్ లో పోలింగ్ బూత్ ఏజెంట్పై వైసిపి వారు దాడి చేసినట్లు, వారు మీడియాకు దాడి గురించి వివరించారు. దీంతో అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ వారి పోలీస్ బృందం గొడవ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పోలీసులు కార్యకర్తలపై కౌన్సిలింగ్ ఇవ్వడంతో గొడవ సద్దు మణిగింది.

- Advertisement -

అలాగే శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో టిడిపి వైసిపి నాయకులు కార్యకర్తల వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. హిందూపురం నియోజకవర్గం నుంచి వైసిపి తరఫున కురుబ దీపిక, టిడిపి తరఫున నందమూరి బాలకృష్ణ రేసులో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలో చిలమత్తూరు మండల ఎంపీపీ పురుషోత్తం రెడ్డి పై టిడిపి వర్గీయులు దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎంపీపీ పురుషోత్తమారెడ్డికి గాయాలు కావడంతోపాటు, ఎంపీపీ వాహనాల అద్దాలను పగలగొట్టినట్లు తెలుస్తోంది.

అలాగే వైసిపి కార్యకర్త నవీన్ పై దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కదిరి పట్టణంలో టిడిపి పోలింగ్ ఏజెంట్ పై వైసిపి వర్గీయులు దాడి చేయడంతో ఆయనకు గాయాల య్యాయి. అలాగే రాప్తాడు మండలంలో ఎం కొండాపురం గ్రామంలో పోలింగ్ స్టేషన్ లోకి వెళ్తుండగా వైసిపి వర్గీయులు అడ్డుకున్నారు. పరిటాల శ్రీరామ్ ను నీవు ఏమైనా అభ్యర్థిగా, నీకు ఈ గ్రామంలో ఓటు ఉందా అని వైసిపి వారు ప్రశ్నించగా సమాధానం చెప్పలేక తిరిగి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అనంతపురం ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. పోలీసులు అప్రమత్తమై చొరవ తీసుకొనడంతో గొడవలు సద్దుమణిగాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News