Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Investments: పెట్టుబడుల వేటలో నారా లోకేశ్‌: టాటా గ్రూప్‌తో కీలక భేటీ, ఏపీకి భారీ...

AP Investments: పెట్టుబడుల వేటలో నారా లోకేశ్‌: టాటా గ్రూప్‌తో కీలక భేటీ, ఏపీకి భారీ విజ్ఞప్తులు!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ముంబైలో కీలక భేటీలు నిర్వహించారు. దేశంలోనే అగ్రగామి వ్యాపార సామ్రాజ్యం టాటా గ్రూప్‌ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తో సమావేశమై, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, అన్ని రంగాల్లో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా లోకేశ్ పలు ముఖ్యమైన అంశాలను టాటా గ్రూప్‌ ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు:

టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం: విశాఖపట్నంలో త్వరలో జరగనున్న టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవానికి రావాలని లోకేశ్‌, టాటా గ్రూపును ఆహ్వానించారు.

గ్రీన్ ఎనర్జీ, ఈవీ రంగం: రాష్ట్రంలో ఈవీ ఛార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధిలో, రూఫ్‌టాప్‌ సోలార్‌ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. అలాగే, సెల్‌, మాడ్యూల్‌ తయారీ యూనిట్‌తో పాటు శ్రీసిటీలో ఈవీ భాగాల తయారీ యూనిట్లు స్థాపించాలని విజ్ఞప్తి చేశారు.

టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్: విశాఖలో టాటా ఎలక్సీ సెంటర్‌, పలు రంగాల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు చేయాలని లోకేశ్‌ కోరారు. శ్రీసిటీలో ఇంజినీరింగ్‌ సెంటర్‌ ఏర్పాటు, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో ఉత్పత్తి యూనిట్లు, టాటా ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో ఓఎస్‌ఏటీ (OSAT – Outsourced Semiconductor Assembly and Test) యూనిట్ ఏర్పాటుపైనా చర్చ జరిగింది.

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం తరఫున భూమి, ప్లగ్‌ అండ్‌ ప్లే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలను సైతం అందిస్తామని లోకేశ్‌ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ భేటీలో టాటా పవర్, ఇండియా హోటల్స్, టాటా ఎలక్సి, టాటా ఆటో కాంప్ వంటి పలు అనుబంధ సంస్థల సీఈవోలు, ఎండీలు పాల్గొన్నారు.

లాజిస్టిక్స్ రంగంలోనూ కీలక చర్చలు
అనంతరం, గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్లాట్‌ఫాం ఈఎస్ఆర్ గ్రూప్ (ESR Group) ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్ అధిపతి సాదత్ షా, డైరెక్టర్ (లీజింగ్) ప్రకృత్ మెహతాతోనూ లోకేశ్ సమావేశమయ్యారు. ఈఎస్ఆర్ గ్రూప్ ఏపీలో సముద్ర ఎగుమతుల కోసం కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు, గిడ్డంగుల నిర్మాణం, పోర్టు ఆధారిత లాజిస్టిక్స్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి లోకేశ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి ఎంత మేర దోహదపడతాయో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad