Aadhaar for elephants: ఏనుగుల సంరక్షణ కోసం ఏపీ అటవీశాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు (Kumki Elephants) ఇకపై ప్రత్యేక గుర్తింపు కార్డులు (ID Cards) జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది.
డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి: ఆధార్ తరహా కార్డుల ప్రక్రియలో భాగంగ, అధికారులు ఇప్పటికే కుంకీ ఏనుగులకు డీఎన్‌ఏ (DNA) పరీక్షలు నిర్వహించారు. సేకరించిన నమూనాలను తదుపరి విశ్లేషణ కోసం డెహ్రాడూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. అక్కడి నుంచి నివేదికలు వచ్చిన వెంటనే కార్డుల జారీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించనున్నారు.
Also read-Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి కలెక్టర్ల సదస్సు.. దిశానిర్దేశం చేయనున్న సీఎం!
గుర్తింపు కార్డులతో కలిగే ప్రయోజనాలు: ఈ ఐడీ కార్డులు కేవలం గుర్తింపు కోసమే కాకుండా ఏనుగుల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రతి ఏనుగు వయసుతో పాటు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అంశాలు ఇందులో ఉంటాయి. భవిష్యత్తులో ఏనుగులకు ఏదైనా అనారోగ్యం చేసినా లేదా అత్యవసర వైద్యం అందించాల్సి వచ్చినా ఈ కార్డులోని సమాచారం వైద్యులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

